హమ్..! ఇప్పుడు రోల్స్ రాయిస్ నుంచి ఎస్‌యూవీ!

By Ravi

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుండటంతో, ఇప్పుడు లగ్జరీ కార్ కంపెనీలన్నీ ఎస్‌‌యూవీల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాయి. కేవలం సెడాన్లు స్పోర్ట్స్ కార్ల తయారీకి మాత్రమే పరిమితమైన అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బెంట్లీ, జాగ్వార్ వంటి కంపెనీలు ఇప్పటికే ఎస్‌యూవీల తయారీకి గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన సంగతి తెలిసినదే.

తాజాగా బ్రిటన్‌కు చెందిన మరొక లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ కూడా ఎస్‌యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల) తయారీపై కన్నేసింది. గతంలో రోల్స్ రాయిస్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రవేశించేందుకు నిరాకరించింది. అయితే, ఇప్పుడు కాలం మారింది. పొడవుగా ఉండే సెడాన్ల కన్నా పెద్దగా ఉండే ఎస్‌యూవీలంటేనే కొనుగోలుదారులు ఎక్కువ మక్కువ చూపుకున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రోల్స్ రాయిస్ కూడా ఎస్‌యూవీకి సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఉన్నాతాధికారి స్వయంగా ధృవీకరించారు. "ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నామ"ని రోల్స్ రాయిస్ సీఈఓ ముల్లర్ ఓట్వోస్ తెలిపారు. ఎస్‌యూవీ తమ బిల్‌కు ఫిట్ అవుతుందో లేదో సమీక్షించేందుకు కంపెనీ ఇప్పటికే స్కెచ్‌లను అభివృద్ధి చేసే పనిలో ఉందని కూడా ఆయన వివరించారు. మరి ఈ రోల్స్ రాయిస్ ఎస్‌యూవీ రోడ్డుపై రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి.

Rolls Royce

More from DriveSpark

Article Published On: Saturday, September 14, 2013, 14:26 [IST]
English summary
"We are intensively thinking about entering the SUV segment," Rolls-Royce CEO Torsten Müller-Ötvös informed Bloomberg recently. He also informed that the company is presently going through the stage of developing conceptual sketches to verify whether or not an SUV fits their bill.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+