హై పెర్ఫామెన్స్ 'రోల్స్ రాయిస్ వ్రైత్' వస్తోంది..!
ప్రపంచంలో కెల్లా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను తయారు చేసే ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'రోల్స్ రాయిస్' ఇప్పుడు అత్యంత శక్తివంతమైన కారును త్వరలోనే ఆవిష్కరించనుంది. రోల్స్ రాయిస్ నుండి అత్యంత పాపులర్ అయిన ఘోస్ట్ లగ్జరీ సెడాన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన 'వ్రైత్' (Wraith) మోడల్‌ను 2013 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించనుంది.
రోల్స్ రాయిస్ వ్రైత్‌కు విడుదలకు సంబంధించి ఇప్పటికే ఓ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.ఈ ఏడాది మార్చి 5 నుంచి 2013 జెనీవా మోటార్ షో ప్రారంభం కానుంది. వ్రైత్ అనే పేరును రోల్స్ రాయిస్ 1938లో ఉపయోగించింది. అప్పట్లో రోల్స్ రాయిస్ తయారు చేసిన అత్యంత వేగవంతమైన కారు 'రోలర్' ఉత్పత్తి కోసం కంపెనీ ఈ పేరును ఉపయోగించడం జరిగింది. ఇందులో 4.3 లీటర్ స్ట్రైట్ సిక్స్ ఇంజన్‌ను ఉపయోగించారు.
కాగా.. 2013 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించనున్న రోల్స్ రాయిస్ వ్రైత్ హై పెర్ఫామెన్స్ కారులో 6.6 లీటర్ వి-12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 600 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. రోల్స్ రాయిస్ట్ ఘోస్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న వ్రైత్, కూపే బాడీ స్టయిల్‌ను కలిగి ఉండి, ఘోస్ట్ సెడాన్ కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుందని సమాచారం. పెద్ద బ్రేక్‌లు, అప్‌రేటెడ్ సస్పెన్షన్, లోవర్ రైడ్ హైట్ ఈ వ్రైత్ ప్రత్యేకతలు.


Click it and Unblock the Notifications









