సెప్టెంబర్ నుంచి పెరగనున్న జనరల్ మోటార్స్ కార్ల ధరలు
జనరల్ మోటార్స్ అందిస్తున్న చెవర్లే కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే, జాగు చేయకుండా తక్షణమే కార్లను కొనేయటం ఉత్తమం. ఎందుకంటే, వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలను 10,000 రూపాయల మేర పెంచనున్నట్లు అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రోజురోజుకీ మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి ధరలు పెంచుతామని జనరల్ మోటార్స్ తెలిపింది. కాంపాక్ట్ కారు బీట్, సెయిల్ ధరలను 2.01 శాతం మేర, మల్టీ పర్పస్ వెహికల్ ఎంజాయ్ ధరను 1.5 శాతం మేర పెంచనున్నామని కంపెనీ పేర్కొంది.

మోడల్‌ను బట్టి ఈ పెంపు రూ.2,000 నుంచి రూ.10,000 రేంజ్‌లో ఉంటుంది. రూపీ క్షీణత తమ మార్జిన్లపై ఇప్పటికే ప్రభావం చూపుతోందని, ఈ వత్తిడిని తట్టుకునేందుకు సెప్టెంబర్ 1 నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు. పై మూడు మోడళ్ల ధరలనే కాకుండా, ఇతర మోడళ్ల ధరలను పెంచే అంశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది.
ఇదిలా ఉండగా, ఆగస్ట్ నెలాఖరు వరకు గోల్డ్ రష్ పేరిట కంపెనీ తమ కార్లపై వివిధ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చెవర్లే కారును డెలివరీ తీసుకునే వారు 2.5 గ్రాముల బంగారు నానేన్ని గెలుచుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








