త్వరలో కార్ల ధరలను పెంచనున్న స్కొడా ఇండియా
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా త్వరలోనే ఉత్పత్తుల ధరలను పెంచనుంది. డాలరు మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో, కంపెనీ దిగుమతి చేసుకునే విడిభాగాల వ్యవం పెరిగి, ఫలితంగా ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో, ధరలు పెంచే పరిస్థితి కనిపిస్తోంది.
స్కొడా ఇండియా దేశీయ విపణిలో తయారు చేస్తున్న కార్లలో ఎక్కువ భాగం విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఇంజన్లు, గేర్ బాక్సులు వంటి కీలక విడిభాగాలను విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, రూపాయి క్షీణత ఈ విడిభాగాల ధరపై భారీ ప్రభావాన్ని చూపుతోంది.
ఇదిలా ఉండగా, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌కు ముందుగానే ధరలు పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) అంకుష్ అరోరా గురువారం సూచనప్రాయంగా వెల్లడించారు.
రూపాయి పతనం ఇలానే కొనసాగుతుంటే, రానున్న రోజుల్లో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు టాటా, స్కొడా బాటలోనే ఉత్పత్తుల ధరలను పెంచే ఆస్కారం ఉంది.



Click it and Unblock the Notifications








