టిటిడికి టొయోటా ఇన్నోవాను దానం చేసిన ఎస్.పి. చౌదరి
ఏడు కొండల వెంకన్న స్వామికి కాసులను కానుకగా ఇచ్చ భక్తులే కాకుండా, వాహనాలను కానుకగా ఇచ్చే భక్తులు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. గతంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో రెనో ఇండియా భారత మార్కెట్లోకి ప్రవేశించిన సందర్భంగా తమ మొట్టమొదటి కారు (రెనో ఫ్లూయెన్స్)ను స్వామి వారికిగా కానుకగా సమర్పించుకుంటే, ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన సత్య మోటార్స్ దాదాపు రూ.2,52 లక్షల విలువైన పియాజ్జియో ఆపే మినీ ట్రక్కు
కాగా.. తాజాగా, కలకత్తాకు చెందిన ఎస్.పి. చౌదరి ఓ టొయోటా ఇన్నోవా కారును టిటిడికి దానం చేశారు. ఎస్.పి. చౌదరి దానం చేసిన టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి ధర సుమారు రూ.17 లక్షలు ఉంటుంది. గురువారం రోజున ఎస్.పి చౌదరి టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి తాళం చెవులను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎస్. శ్రీనివాస రాజుకు అందజేశారు.

టిటిడికి టొయోటా ఇన్నోవాను దానం చేసిన ఎస్.పి. చౌదరి

టిటిడికి టొయోటా ఇన్నోవాను దానం చేసిన ఎస్.పి. చౌదరి

టిటిడికి టొయోటా ఇన్నోవాను దానం చేసిన ఎస్.పి. చౌదరి

టిటిడికి టొయోటా ఇన్నోవాను దానం చేసిన ఎస్.పి. చౌదరి

Click it and Unblock the Notifications