భారత్‌లో లాంబోర్గినీ ట్రాక్టర్లను విడుదల చేసిన ఎస్‌డిఎఫ్ గ్రూప్

By Ravi

లాంబోర్గినీ ట్రాక్టర్లు భారత్‌కు వస్తున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసనదే. కాగా.. గురువారం లాంబోర్గినీ తమ 'లగ్జరీ ట్రాక్టర్ల'ను దేశీయ విపణిలో విడుదల చేసింది. వాస్తవానికి లాంబోర్గినీ సూపర్‌కార్ల తయారీ కన్నా ముందుగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది. ఈ ట్రాక్టర్ల వ్యాపారం సేమ్ డచ్-ఫార్ (ఎస్‌డిఎఫ్) (SAME Deutz-Fahr) గ్రూపు నిర్వహిస్తోంది.

అయితే, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, లాంబోర్గినీ బ్రాండ్‌ను స్వాధీనం చేసుకోవటంతో, ఈ ట్రాక్టర్ల వ్యాపారం కూడా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో భాగమైపోయింది. లాంబోర్గినీ బ్రాండ్ కింద ఈ ప్రీమియం ట్రాక్టర్లను అందిస్తున్నామని ఎస్‌డిఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భాను శర్మ తెలిపారు. భారత్‌లో ఈ ట్రాక్టర్ల ధరలు సుమారు రూ.12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని ఆయన చెప్పారు.


ప్రారంభంలో భాగంగా, భారత మార్కెట్లో 30 హెచ్‌పి ట్రాక్టర్లను అందిస్తామని, ఆ తర్వాత 70-80 హెచ్‌పి ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ప్రస్తుతం ఈ 30 హెచ్‌పి ట్రాక్టర్లను యూరప్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తామని, ఇవి కేవలం వ్యవసాయ పనులకే కాకుండా, రిసార్టులు, స్టేడియంలోల కూడా వివిధ పనుల కోసం వాడుకోవచ్చని శర్మ తెలిపారు.
SDF Group Launches Lamborghini Tractor In India

ఎస్‌డిఎఫ్ ఇండియా, తమిళనాడులోని రాణిపేట్ ఉత్పత్తి కేంద్రంలో లాంబోర్గినీ ట్రాక్టర్ల ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఇక్కడ ఉత్పత్తి అయిన ట్రాక్టర్లను భారత మార్కెట్లో విక్రయించడం లేదు. వీటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గడచిన సంవత్సరంలో ఎస్‌డిఎఫ్ గ్రూప్ భారత్‌లో నిర్మించిన 6,000 ట్రాక్టర్లలో 800 ట్రాక్టర్ల లాంబోర్గినీ లోగోతో రూపొందించారు. ఈ ట్రాక్టర్లను యూరప్, మలేషియా దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. ఈ ట్రాక్టర్లలో ఎక్కువ భాగం స్థానికంగా భారత్‌లో లభించే విడిభాగాలను ఉపయోగిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2013, 10:25 [IST]
English summary
Italian farm equipment maker Same Deutz-Fahr (SDF) group on Thursday introduced its premium tractor under the Lamborghini brand in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+