అబిదాబి రేస్‌లో వెటెల్ విజయం; షుమాకర్ రికార్డ్ సమం

By Ravi

ఫార్ములా వన్ మోటార్‌స్పోర్ట్‌లో విజయాల పరంగా మైఖేల్ షుమాకర్‌తో పోటీపడుతూ, అతి చిన్న వయసులోనే వరసు విజయాలను సొంతం చేసుకుంటున్నాడు ఈ జర్మన్ బుల్లోడు సెబాస్టియన్ వెటెల్. ఇటీవలే 2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న వెటెల్ అదే జోరుతో తాజాగా అబుదాబి గ్రాండ్ ప్రిలో కూడా విజయం సాధించాడు.

ఈ సీజన్‌లో వెటెల్‌కు ఇది వరుసగా 7వ విజయం కాగా, మొత్తమ్మీద చూసుకుంటే ఇది 11వ విజయం. మొత్తం 55 ల్యాప్‌ల అబుదాబి రేస్‌ను సెబాస్టియన్ వెటెల్ 1 గంటా 38 నిమిషాల 6.106 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ రేస్‌లో రెడ్‌బుల్‌ జట్టుకుకే చెందిన మార్క్ వెబెర్ ద్వితీయ స్థానంలో నిలువగా, మెర్సిడెజ్ డ్రైవర్ రోస్‌బర్గ్ తృతీయ స్థానంలో నిలిచాడు.

Sebastian Vettel

గతంలో (2004)లో మైఖేలు షుమాకర్ కూడా వరుసగా 7 విజయాలను సాధించిన ఎఫ్1 డ్రైవర్‌గా రికార్డు సృష్టించాడు. తాజా విజయంతో వెటల్ ఈ రికార్డును చేరుకున్నట్లయింది. అలాగే, ఈ సీజన్‌లో మిగిలి ఉన్న రెండు రేస్‌లను కూడా వెటెల్ నెగ్గగలిగితే వరుసగా 9 సార్లు గెలిచిన ఆల్బర్టో అస్కారి (1952-53) రికార్డును సమం చేసినవాడు అవుతాడు.

ఇదిలా ఉండగా.. మన దేశానికి చెందిన ఎఫ్1 జట్టు సహారా ఫోర్స్ ఇండియా ప్రదర్శన ఇండియన్ గ్రాండ్‌ ప్రి కంటే మెరుగుపడింది. ఈ సీజన్‌లో ద్వితీయ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఫోర్స్ డ్రైవర్ పాల్ డి రెస్టా 6వ స్థానంలో నిలవగా, మరో ఎఫ్1 డ్రైవర్ ఆడ్రియన్ సుటిల్ 10వ స్థానంలో నిలిచాడు. సహారా ఫోర్స్ ఇండియాకు ఇది వరుసగా రెండో డబుల్ పాయింట్ ఫినిష్ కావడం విశేషం.

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2013, 18:37 [IST]
English summary
Formula One world champion Sebastian Vettel captured the Etihad Airways Abu Dhabi Grand Prix to clinch a seventh straight victory and 11th of the season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+