మానేసర్ ప్లాంట్‍లో సమ్మె జరిగి ఏడాది; 145 సెక్షన్ విధింపు

అంతేకాకుండా, కంపెనీ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ అవనిష్ కుమార్‌ను సజీవంగా కాల్చి చంపేశారు. దీంతో కంపెనీ మానేసర్ ప్లాంటును కొంతకాలం మూసేసింది. హింసకు పాల్పడిన సుమారు 2,500 మంది కార్మి కులను విధులనుంచి తొలగించారు. వారిలో 147 మంది కార్మికులను, యూనియన్ నాయకులు జైలుకు పంపించారు. వారంతా ఇప్పుడు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ సంఘటన సందర్భంగా గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా తిరిగి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాజాగా గురువారం మానేసర్ ప్లాంటు ముందుకు నిరసనకు దిగారు. దీంతో బెంబేలెత్తిన యాజమాన్యం సుమారు 1000 మంది పోలీసు బలగాలును ప్లాంటు ఆవరణంలో మోహరింపజేసింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు సమాచారం.
మానేసర్ ప్లాంట్ చుట్టుపక్కల పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగాలు కోల్పోయినవారు తిరిగి దాడులకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలుసులు గట్టి పహారా కాస్తున్నారు. దీనికి పరిసర గ్రామస్తులు కూడా బాగానే సహకరిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయినవారిని ప్లాంట్ దరిదాపుల్లోకి కూడా రాకుండా నిరోధిస్తున్నారు. వీరివల్ల తమ కుటుంబంలోని వారు కంపెనీలో ఉద్యోగాలు కోల్పోవాల్సివస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








