డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించాలంటున్న సియామ్

నిజమైన పేద రైతులకు డీజిల్‌పై సబ్సిడి ఇవ్వాలనుకుంటే, దానిని నేరుగా క్రెడిట్ రూట్లో ఇవ్వొచ్చని ఆయన అన్నారు. మార్కెట్లో సాధారణ అవసరాలకు వినియోగించే డీజిల్‌ను మాత్రం మార్కెట్ ధరలకే విక్రయించాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, దఫాల వారీగా డీజిల్ ధరను రానున్న 10 నెలల్లో రూ.10 మేర పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేస్తోంది. ఇందుకు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదే గనుక జరిగితే రానున్న పది నెలల్లో ప్రతి నెలకు లీటరు డీజిల్‌పై ఒక్కో రూపాయి చొప్పున పెంపు విధించే అవకాశం ఉంది. చమురు కంపెనీలు వంట గ్యాస్, డీజిల్, కిరోసిసన్‌లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో గడచిన సంవత్సరంలో సుమారు 1,67,000 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లనట్లు అంచనా. కాగా.. గడచిన సెప్టెంబర్ నెలలో చమురు కంపెనీలు లీటరు డీజిల్ ధరపై ఒక్కసారిగా రూ.5 పెంపును విధించాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.47.15 లుగా ఉంది. ఈ ధరకు విక్రయిస్తున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.28 నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








