ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున స్కొడా ఫ్రీ పొల్యూషన్ చెకప్

By Ravi

Skoda Free Pollution Check Camp World Environment Day
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సహకారంతో స్కొడా ఆటో ఇండియా తమ వినియోగదారుల కోసం ఉచిత పొల్యూషన్ చెకప్ క్యాంప్‍‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న స్కొడా ఆటో ఇండియా అధీకృత డీలర్‍‌షిప్ కేంద్రాలలో ఈ ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్ అందుబాటులో ఉండనుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కొడా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

అనేక మంది డీలర్లు ఈ క్యాంప్‌లో పాల్గొనేందుకు హామీ ఇచ్చారని, అంతేకాకుండా ఈ క్యాంప్‌కు వాహనాలను తీసుకు వచ్చే తమ స్కొడా వినియోగదారులకు కార్ మెయింటినెన్స్ చిట్కాలను మరియు వాహన జీవిత కాలాన్ని పెంచుకునే చిట్కాలను తెలియజేస్తారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉచిత పొల్యూషన్ చెకప్ ఒక్క రోజు మాత్రమే అంటే జూన్ 5, 2013న మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ క్యాంప్‌కు తీసుకువచ్చే స్కొడా వాహనాలను నిపుణులైన టెక్నీషియన్లు ఉచితంగా పొల్యూషన్‌ను చెకప్ చేసి, లోపాలు ఏవైనా ఉంటే ఇంజన్‌‌ను క్లీన్ చేయటం చేస్తారు. అంతేకాకుండా, ఈ పొల్యూషన్ చెకప్ క్యాంప్‌కు విచ్చే స్కొడా ఓనర్లకు కాంప్లిమెంటరీగా పియూసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి మీరు మీ స్కొడా కారును ఈ చెకప్‌కు తీసుకువెళ్తున్నారా..?

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2013, 11:10 [IST]
English summary
Check-republic carmaker Skoda Auto India, is organising a one-day Free Pollution Check Camp in association with the Industry body, the Society of Indian Automobile Manufacturers (SIAM) at Skoda Auto Dealers across the country in commemoration of World Environment Day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+