ర్యాపిడ్ సెడాన్ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసిన స్కొడా

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న ర్యాపిడ్ సెడాన్ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. స్కొడా ర్యాపిడ్ ఇప్పుడు కేవలం రెండు వేరియంట్లలో (యాంబిషన్ ప్లస్, ఎలిగాన్స్) మాత్రమే లభ్యమవుతోంది.

స్కొడా యాంబిషన్ ప్లస్ వేరియంట్‌లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, ఎమ్‌పి3, బ్లూటూత్, ఎస్‌డికార్డ్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్, 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఆప్షనల్‌గా లెథర్ ప్యాకేజ్ (లెథర్ సీట్ కవర్స్, స్టీరింగ్ కవర్, గేర్ నాబ్ కవర్) కూడా లభిస్తుంది. ఈ ప్యాకేజ్ ఆన్-బోర్డ్ కంప్యూటర్‌తో కూడా లభిస్తుంది.

Skoda Rapid

ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్ అయిన ర్యాపిడ్ ఎలిగాన్స్‌లో పై ఫీచర్లకు అదనంగా 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. అప్‌డేట్ చేసిన స్కొడా ర్యాపిడ్ కొత్త ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

పెట్రోల్ వెర్షన్ ధరలు:
* స్కొడా ర్యాపిడ్ 1.6 యాంబిషన్ ఎమ్‌టి - రూ.8.04 లక్షలు
* స్కొడా ర్యాపిడ్ 1.6 యాంబిషన్ ఏటి - రూ.9.04 లక్షలు
* స్కొడా ర్యాపిడ్ 1.6 ఎలిగాన్స్ ఎమ్‌టి - రూ.8.63 లక్షలు
* స్కొడా ర్యాపిడ్ 1.6 ఎలిగాన్స్ ఏటి - రూ.9.63 లక్షలు

డీజిల్ వెర్షన్ ధరలు:
* స్కొడా ర్యాపిడ్ 1.6 ఎమ్‌టి - రూ.9.42 లక్షలు
* స్కొడా ర్యాపిడ్ 1.6 ఎలిగాన్స్ ఎమ్‌టి - రూ.9.77 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, October 16, 2013, 14:48 [IST]
English summary
Check-republic carmaker Skoda India has updated its Rapid sedan line-up. Now new Skoda Rapid will be available only in two variants - Ambition Plus and Elegance. Prices start at Rs 8.04 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+