స్కొడా ర్యాపిడ్ కోసం 100 శాతం ఫైనాన్స్ ఆఫర్
కార్లను కొనకుండా బెట్టు చేస్తున్న కొనుగోలుదారులను బుజ్జగించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పలు వినూత్నమైన, విశిష్టమైన మార్కెటింగ్ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. గడచిన కొద్ది నెలలు కార్ల అమ్మకాలు పడిపోవటంతో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా తమ ర్యాపిడ్ సెడాన్ కోసం ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.
గడచిన నెలలో ఈ కారును కొనుగోలు చేసిన 12 నెలల తర్వాతి నుంచి ఈఎమ్ఐను చెల్లించడంటూ కొనుగోలుదారులను ఆకర్షించిన స్కొడా ఇప్పుడు ర్యాపిడ్‌పై 100 శాతం ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్‌లో స్కొడా ర్యాపిడ్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం రుణ మొత్తాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కొడా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే, ఇది ఏప్రిల్ 18, 2013 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

స్కొడాకు చెందిన ఆర్థిక విభాగం, స్కొడా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా స్కొడా ఆటో ఇండియా మార్కెటింగ్ హెడ్ కమల్ బసు మాట్లాడుతూ.. వినియోగదారుల ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీ వివిధ స్కీమ్‌లను అందిస్తుందని, ఇందులో భాగంగానే ఈ 100 శాతం ఫైనాన్స్ స్కీమ్‌ను అందిస్తున్నామని, ఈ స్కీమ్ ద్వారా కొనుగోలుదారులు తమ కారు కలను నిజం చేసుకోవచ్చని చెప్పారు.
గడచిన నెలలో ర్యాపిడ్ సెడాన్ కోసం స్కొడా ఆటో ఇండియా ప్రవేశపెట్టిన ఈఎమ్ఐ హాలిడే ఆఫర్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ స్కీమ్‌ను మరొక నెలపాటు (ఏప్రిల్ 2013 నెలాఖరు వరకూ) పొడగిస్తున్నామని, ఈ ఆఫర్‌తో పాటుగా ప్రస్తుత 100 శాతం ఫైనాన్స్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు తమ సౌకర్యాన్ని బట్టి, తమకు నచ్చిన స్కీమ్‌ను ఎంచుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ స్కీమ్‌లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








