స్కొడా లారాలో ఆటోమేటిక్ వేరియంట్ విడుదల

By Ravi

స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'లారా'లో ఓ సరికొత్త ఆటోమేటిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కొడా లారాలో కంపెనీ ఆఫర్ చేస్తున్న యాంబిషన్ 1.8 లీటర్ పెట్రోల్ వేరియంట్‌లో ఈ ఆటోమేటిక్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. 6-స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు లక్ష రూపాయల వరకూ అదనం.

స్కొడా లారా యాంబిషన్ 1.8 ఆటోమేటిక్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అమర్చిన 1.8 లీటర్ టర్బోఛార్జ్‌డ్, ఇన్-లైన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, డైరెక్ట్ ఇంజక్షన్, 16వి డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 160 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీనిస్తుండగా, ఆటోమేటిక్ వేరియంట్ మాత్రం లీటరుకు 14.6 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సాధారణంగా మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు అధిక మైలేజీని ఆఫర్ చేస్తాయి. అయితే, ఈ ఆటోమేటిక్ లారా మాత్రం మ్యాన్యువల్ వేరియంట్ కన్నా ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేయటం విశేషం. ఇందులో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది (మ్యాన్యువల్ వేరియంట్‌లో ఈ ఫీచర్ లేదు). దేశీయ విపణిలో ఈ స్కొడా లారా యాంబిషన్ 1.8 ఆటోమేటిక్ వేరియంట్‌ ధర రూ.15.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్కొడా లారా ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ ఎలాంట్రా, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, రెనో ఫ్లూయెన్స్, చెవర్లే క్రూజ్, టొయోటా కరోలా ఆల్టిస్ వంటి మోడళ్ల సరసన నిలుస్తుంది.

Skoda Laura

More from DriveSpark

Article Published On: Tuesday, February 5, 2013, 19:27 [IST]
English summary
Skoda Laura Ambition 1.8 litre petrol variant now available with automatic transmission. Skoda India has now introduced the optional 7-speed DSG gearbox to this variant, which offers an impressive 14.6kmpl of mileage. The new automatic Laura has been priced at Rs. 15.65 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+