స్కొడా ర్యాపిడ్ కోసం ఆకర్షనీయమైన ఈఎమ్ఐ ఆఫర్

స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'స్కొడా ర్యాపిడ్' కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌ను అందిస్తోంది. లోన్ ద్వారా స్కొడా ర్యాపిడ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఓ ప్రత్యేక ఈఎమ్ఐ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా, కొనుగోలుదారులు కేవలం ప్రతినెలా రూ.8,999 చెల్లించడం ద్వారా ర్యాపిడ్ సెడాన్‌ను సొంతం చేసుకోవచ్చు. స్కొడా ఆర్థిక విభాగం స్కొడా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమితం కాలం మాత్రమే.

స్కొడా ర్యాపిడ్‌ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.

Skoda Rapid

స్కొడా ర్యాపిడ్ టాప్-ఎండ్ వేరియంట్లో (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇది సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్లలో ఇది లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 7, 2013, 15:37 [IST]
English summary
Skoda Finance is offering attractive EMI offers for its entry level sedan Skoda Rapid. Now buyers can own a Rapid sedan at Rs 8,999 EMI. This is a limited period offer only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+