ఫిబ్రవరిలో స్కొడా ర్యాపిడ్ అల్టిమా వేరియంట్ విడుదల

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ సెడాన్ 'ర్యాపిడ్'లో మరో కొత్త వేరియంట్ మార్కెట్లోకి రాబోతుంది. కొత్త సంవత్సరం కానుకగా 'స్కొడా ర్యాపిడ్ అల్టిమా' (Skoda Rapid Ultima)అనే కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేయనుంది.

వాస్తవానికి ఇదొక స్పెషల్ ఎడిషన్ ర్యాపిడ్ సెడాన్. దీనిపై అల్టిమా బ్యాడ్జింగ్ ఉంటుంది. బానెట్, రూఫ్, సైడ్స్‌పై ఆకర్షనీయమై బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ కాస్మోటిక్ మార్పులు తప్ప స్కొడా ర్యాపిడ్ అల్టిమాలో పెద్దగా చెప్పుకోదగిన అంశాలేవీ లేవు.

Skoda Rapid

అయితే, ఇంటీరియర్స్ పరంగా చూస్తే, ఇందులో కొత్త డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, లెథర్ సీట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది.

స్కొడా ర్యాపిడ్ అల్టిమా 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇది 105 పిఎస్‌ల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 20.5 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్కొడా ర్యాపిడ్ అల్టిమా విక్రయం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2013, 11:55 [IST]
English summary
Skoda India will launcha a new variant of Rapid, dubbed as the Rapid Ultima in India in February 2014. This new variant will feature the Ultima bade and stickers above Rapid branding, decals on the sides, bonnet and the roof. Apart from these new changes, the car will remain identical to the regular Rapid.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+