స్కొడా వినియోగదారుల కోసం ఉచిత సమ్మర్ సర్వీస్ క్యాంప్
మీరు స్కొడా కారు వినియోగిస్తున్నారా..? మరి ఈ సమ్మర్ సీజన్ మీ స్కొడా కారు పూర్తి కండిషన్‌లో ఉందా..? లేనట్లయితే, మీ సమీపంలోని అధీకృత స్కొడా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి మీ కారులోని లోపాలను ఫిక్స్ చేయించుకోండి. తమ వినియోగదారులకు మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వేసవిలో స్కొడా ఓ కాంప్లిమెంటరీ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 8, 2013 నుంచి ప్రారంభమైన ఈ ఉచిత సమ్మర్ సర్వీస్ క్యాంప్ మే 8, 2013 30 వరకూ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కొడా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలు, సర్వీస్ సెంటర్లలో ఈ ఉచిత సర్వీసింగ్ క్యాంప్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా స్కొడా సర్వీస్ సెంటర్లకు తీసుకు వచ్చే స్కొడా వాహనాల్లో ఏసి, టైర్లు, బ్రేక్స్, ఇంజన్ వంటి 20-పాయింట్ ఫ్రీ చెకప్ చేయబడుతుంది.
ఈ చెకప్‌లో ఏవైనా లోపాలను గుర్తిస్తే వాటిని సరి చేయటం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా విడిభాగాలు మార్చాల్సి వస్తే తగ్గింపు ధరకే ఒరిజనల్ స్పేర్ పార్ట్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. సాధారణంగా వేసవిలో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి, వాహనం కండిషన్‌లో ఉండటం ఎంతో ముఖ్యం. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో స్కొడా డీలరును సంప్రదించండి లేదా 1800-267-2202 టోల్-ఫ్రీ నెంబరుపై ఫోన్ చేసి మీ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోండి.



Click it and Unblock the Notifications








