భారత మార్కెట్ కోసం సరికొత్త స్కొడా ఎస్‌యూవీ
చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడాకు భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. ఈ సెగ్మెంట్లలో కంపెనీ ఆఫర్ చేసిన ఫ్యాబియా, యెటి మోడళ్లు కొనుగోలుదారులను ఆకట్టుకోవటం విఫలమయ్యాయనే చెప్పొచ్చు. కానీ, స్కొడా ఇటీవల విడుదల చేసిన ర్యాపిడ్, ఆక్టావియా సెడాన్లు మాత్రం ఫర్వాలేదనిపించాయి. సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, స్కొడా ఇప్పుడు ఓ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది.
యూకేకి చెందిన ఓ ఆంగ్ల పత్రకకు కంపెనీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, అంత సజావుగా సాగితే 2016 నాటికి ఓ కొత్త స్కొడాను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ విన్‌ఫ్రీడ్ వాలండ్ వెల్లడించారు.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌బ్లూ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని, స్కొడా తమ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌బ్లూ 2015లో మార్కెట్లోకి రానుంది. ఈ రెండు మోడళ్లును కూడా కంపెనీ యొక్క పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు (ఆడి ఎస్‌యూవీలను కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు).
స్కొడా నుంచి రానున్న ఈ పెద్ద ఎస్‌యూవీ 4.6 మీటర్లను పొడవుతో, 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో, ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ మోడల్‌ను ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీకి ఎగువన ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని కియా సోరెన్టో, హ్యుందాయ్ శాంటాఫే మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








