ఫ్యాబియా ఉత్పత్తిని నిలిపివేయనున్న స్కొడా ఇండియా

By Ravi

స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ 'స్కొడా ఫ్యాబియా' ఇక కనుమరుగు గానుంది. ఒకప్పట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫ్యాబియా, ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పెరిగిన పోటీ నేపథ్యంలో ఈ మోడల్ అమ్మకాలు క్రమేనా తగ్గతూ వచ్చి కంపెనీ నష్టాలను మిగుల్చుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రస్తుతం స్కొడా ఇండియా ఫ్యాబియాను భారత్‌లోనే అసెంబ్లిగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యాబియా అసెంబ్లింగ్ కిట్లు ఖాలీ అయ్యే వరకు లేదా ఫ్యాబియా స్టాక్ ఖాలీ అయ్యే వరకు మాత్రమే ఇది దేశీయ విపణిలో అందుబాటులో ఉంటుంది. స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది.

అయితే, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ అనేక సార్లు ఫ్యాబియా ధరలో కోతను విధించింది. 2008 నుంచి ఇప్పటి వరకూ ఈ కారు ధరలో దాదాపు 40 శాతం కోతను విధించటం జరిగింది. దీంతో ఈ కారు అమ్మకంపై కంపెనీ నష్టాలను చవిచూస్తోంది. స్కొడా ఫ్యాబియా 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఫ్యాబియా కారు అమ్మకంపై కంపెనీ 1.5 లక్షల మేర నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న స్కొడా ఫ్యాబియా ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, 2015 లోపుగా ఓ సరికొత్త చవక ఫ్యాబియాను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం లభిస్తున్న ఫ్యాబియాకు మోడిఫైడ్ వెర్షనా (ఎస్‌కె 250) లేక వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానున్న సరికొత్త ఫ్యాబియా (ఎస్‌కె260)నా అనేది తేలాల్సి ఉంది.

Fabia

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2013, 13:39 [IST]
English summary
Skoda Auto India has taken the decision to discontinue the Fabia premium hatchback in the country, Autocar India has learned. The decision does not come as a surprise and was long expected. The Fabia has been a loss making product for the Czech automaker in the country ever since its launch in 2008.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+