మెట్రో రైలుపై స్కొడా ర్యాపిడ్.. గుర్గావ్‌లో వినూత్న ప్రచారం!

By Ravi

మార్కెట్లో ఏ ఉత్పత్తికైనా మంచి స్పందన లభించాలంటే, సరైన మార్కెటింగ్ క్యాంపైన్ అవసరం. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఆటో ఇండియా, దేశయ విపణిలో విక్రయిస్తున్న తమ ర్యాపిడ్ సెడాన్ కోసం కంపెనీ ఓ వినూత్న మార్కెటింగ్ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గుర్గావ్ మెట్రో రైలుతో కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా, గుర్గావ్ మెట్రోల్ లైన్‌పై వెళ్లే ట్రైన్లన్నింటినీ స్కొడా ర్యాపిడ్‌ ప్రకటనతో కవర్ చేసేసింది. ఈ ప్రకటనను దూరం నుంచి చూస్తే, మెట్రో రైల్ ట్రాక్‌పై స్కొడా కార్లు పరుగులు తీస్తున్నట్లుగా అనిపిస్తుంది. పూర్తి మెట్రో రైలుపై ఒకే ప్రోడక్ట్‌ను ప్రచారం చేయటం కూడా ఇదే మొదటిసారి (దీన్ని బట్టి చూస్తుంటే, ర్యాపిడ్ క్యాంపైన్ కోసం స్కొడా బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది).


ఈ సందర్భంగా, స్కొడా ఆటో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ కమల్ బసు మాట్లాడుతూ.. 'సింప్లీ క్లెవర్' అనే తమ బ్రాండ్ ఫిలాసఫీ ఆధారంగా ఈ ప్రయత్నం చేశామని, తమకు అతి ముఖ్యమైన మార్కెట్లలో గుర్గావ్ కూడా ఒకటని, ఈ ఒప్పందం ద్వారా తమ బ్రాండ్ గురించి రోజుకు 6 నుంచి 7 లక్షల మంది ప్రజల్లో అవగాహన కలుగుతుందని అన్నారు.

గుర్గావ్ మెట్రో రైలుతో స్కొడా కుదుర్చుకున్న ఒప్పందం మూడు నెలల పాటు కొనసాగుతుంది. ఈ ప్రకటనకు మంచి స్పందన లభించినట్లయితే, దీనిని మరికొంత కాలం పాటు పొడగించే ఆస్కారం ఉంటుంది.

స్కొడా ర్యాపిడ్‌ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.

Skoda Rapid Metro

టాప్-ఎండ్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్‌ (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇది సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్లలో ఇది లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 3, 2013, 16:31 [IST]
English summary
Skoda India ties up with the Gurgaon Rapid Metro with an innovative marketing initiative. For the first time, the entire train on the Gurgaon Metro line will be branded with the Rapid model line from Skoda Auto India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+