మైక్రో కార్ల తయారీపై దృష్టిపెట్టిన జపనీస్ ఆటో కంపెనీలు

ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ మారింది. కస్టమర్లు 'చిన్న కార్లు వద్దు, మైక్రో కార్లే ముద్దు' అంటున్నారు. భారత్, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాల్లో మైక్రో కార్లకు డిమాండ్ బాగా ఉంటుందని జపాన్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగటంతో పెద్ద కార్లను కొనాలనుకునే కస్టమర్లు కూడా ఎక్కువ మైలేజీనిచ్చే చిన్న కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో మైక్రో కార్ల మార్కెట్ పరిమాణం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో, మైక్రో కార్ సెగ్మెంట్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీయ, అంతర్జాతీయ కార్ కంపెనీలు (ప్రధానంగా జపనీస్ ఆటోమొబైల్ కంపెనీలు) ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. పెరుగుతన్న జనాభాతో పాటుగానే కార్ల వినియోగం కూడా నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా వాహనాల రద్దీ పెరగటం, పార్కింగ్ స్థలం లేకపోవటం వంటి సమస్యలు తలెత్తున్నాయి.

Honda N Box

ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన కార్ కంపెనీలు నలుగు ప్రయాణికులు ప్రయాణించగలిగే మైక్రో కార్ల తయారీకి శ్రీకారం చుట్టాయి. ఇలా తయారైందే హోండా ఎన్‌ బాక్స్ కారు. జపాన్ మార్కెట్లో ఈ కారు ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ కారును 660సీసీ ఇంజన్‌తో తయారు చేశారు. జపాన్ రోడ్లపై తిరుగుతున్న మొత్తం కార్లలో వీటి సంఖ్య 40 శాతంపైనే ఉంటుందంటే ఈ కారు ఎంతగా అమ్ముడైందో అర్థం చేసుకోవచ్చు.

అయితే కొన్ని ధనిక దేశాల్లో ‘కే' పేరుతో అమ్ముడవుతున్న ఈ కారును పట్టించుకున్న వాళ్లే లేరు. దీంతో హోండా భారత్, ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కారును మార్కెట్ చేయాలని యోచిస్తోంది. హోండా ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 లక్షల వాహనాలను విక్రయిస్తోంది. 2017 నాటికి ఈ సంఖ్యను 60 లక్షలకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మైక్రో కార్ల ద్వారానే సాధ్యమవుతుందని హోండా భావిస్తోంది.

Honda N Box Micro Car

హోండాతో పాటుగా మరికొన్ని జపనీస్ కంపెనీలు కూడా మైక్రో కార్ల తయారీపై దృష్టి సారించాయి. టొయోటా ఇప్పటికే చిన్న కార్లను అభివృద్ధి చేస్తోంది. మరొక జపనీస్ కంపెనీ నిస్సాన్ కూడా వర్ధమాన దేశాల్లో మైక్రో కార్లకు మంచి డిమాండ్ ఉంటోందని విశ్వసిస్తుంది. సుజుకి, జనరల్ మోటార్స్ కంపెనీలు కూడా మైక్రో కార్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 17, 2013, 11:20 [IST]
English summary
Japanese automakers like Honda Motor and the Toyota-Daihatsu group have a problem: the smallest cars they make are very big in Japan - and only Japan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+