ఎయిర్ కండిషన్డ్ ట్రాక్టర్లను విడుదల చేసిన సోనాలికా
పంజాబ్‌కు చెందిన ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలికా గ్రూప్, అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా ఎయిర్ కండిషన్, హీటర్ ఆప్షన్‌తో కూడిన హెవీ డ్యూటీ ట్రక్కులను పరిచయం చేసింది. వరల్డ్‌ట్రాక్ 90 హెచ్‌పిగా పిలిచే ఈ ట్రాక్టర్ ధర రూ.14.45 లక్షలుగా ఉంది.
ఇందులో డ్రైవర్‌కు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా ఇందులో డ్రైవర్ సీట్‌ను డిజైన్ చేశారు. ఈ ట్రాక్టర్‌లో ఉపయోగించిన 4 సిలిండర్, 90 హార్స్ పవర్ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో ఏసి/హీటర్ సదుపాయం ఉన్నప్పటికీ మైలేజ్, పవర్ విషయంలో ఇది ఎక్కడా రాజీ పడదని కంపెనీ పేర్కొంది.
ఈ సోనాలికా వరల్డ్‌ట్రాక్ 90 హెచ్‌పి హెవీ డ్యూటీ ట్రాక్ట్రర్ 2500 కేజీల పేలోడ్‌ను సునాయసంగా క్యారీ చేయగలదు. ఇందులోని డ్రైవర్ క్యాబిన్‌లో డ్యూయెల్ స్పీకర్లతో కూడిన మ్యాజిక్ సిస్టమ్, కప్ హోల్డర్స్, ఈ మార్క్‌డ్ క్యాబిన్ గ్లాసెస్, ఫ్రంట్ అండ్ రియర్ వైపర్స్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది. సోనాలికా డీలర్లు/భాగస్వాముల ద్వారా ఈ ట్రాక్టర్ అందుబాటులో ఉంటుంది.

గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన ట్రాక్టర్‌ను దేశీయ విపణికి పరిచయం చేసిన సంగతి తెలిసినదే. "అర్జున్ ఇంటర్నేషనల్" అనే 85 హార్స్ పవర్ ఇంజిన్ సామర్థ్యం గల ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) ట్రాక్టర్‌ను కంపెనీ గడచిన సంవత్సరం పంజాబ్‌లోని లూథియానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 'కిసాన్ మేళా'లో ఆవిష్కరించింది.
దేశంలోనే తొలిసారిగా తాము ఏసి క్యాబిన్ కలిగిన ట్రాక్టర్‌ను ఆవిష్కరిస్తున్నామని ఎమ్ అండ్ ఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ట్రాక్టర్ అండ్ ఫామ్ మెకానిజేషన్ బిజినెస్) బిష్వంభర్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఇవి వాణిజ్యపరంగా భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. దీని ధర కూడా రూ.15 లక్షల మేర ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








