మరింత ప్రియం కానున్న థర్డ్ పార్టీ మోటార్స్ ఇన్సూరెన్స్

By Ravi

Car
ప్రీమియం చెల్లింపులో భారీ పెంపును విధించాలన్న బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) ప్రతిపాదనతో, త్వరలోనే థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఇదే గనుక అమల్లోకి వస్తే, ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్లో (1000సీసీ ఇంజన్లకు దిగువన) థర్డ్ పార్టీ మోటార్ వాహనా బీమా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్లో గరిష్టంగా 85 శాతం పెంపును ఐఆర్‌డీఏ ప్రతిపాదిస్తోంది.

అలాగే, 1000-1500సీసీ సెగ్మెంట్లో కనిష్టంగా 1.4 శాతం పెంపును, 1500సీసీ ఎగువన గరిష్టంగా 43 శాతం పెంపును విధించాలని ఐఆర్‌డీఏ యోచిస్తోంది. ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్లో ఎక్కువగా తొలిసారి కారును కొనుగోలు చేసేవారు ఎక్కువ ఉన్నందున, ఈ సెగ్మెంట్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయ నెపంతో, ఈ సెగ్మెంట్ క్రిందకు వచ్చే వాహనాలపై గరిష్ట మొత్తంలో బీమాను పెంచాలని ఐఆర్‌డీఏ ప్రతిపాదించినట్లు సమాచారం.

వాణిజ్య వాహనాలపై థర్డ్ పార్టీ ప్రీమియం కూడా దాదాపు 90 శాతం మేర పెరిగే ఆస్కారం ఉంది. స్వంత డ్యామేజ్ ఇన్సూరెన్స్ మాదిరిగానే థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కూడా అన్ని వాహనాలకు (ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాలు) తప్పనిసరి. ఇది వాహన యజమానులు క్లెయిమ్‌తో పాటుగా బాధితుల క్లెయిమ్‌లను కూడా కవర్ చేస్తుంది.

అధిక క్లెయిమ్‌ల కారణంగా, ఈ విభాగంలో బీమా కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్న నేపథ్యంలో, అధిక ప్రీమియంల ద్వారా ఈ నష్టాలను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో, థర్డ్ పార్టీ మోటార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంలలో ఈ ప్రతిపాదిత పెంపును తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే స్వంత డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2013, 14:33 [IST]
English summary
Vehicle users will need to shell out more money to get their vehicles insured. The Insurance Regulatory and Development Authority (IRDA) proposing an increase in the rates of third party insurance premiums.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+