ప్రత్యేక ధరకే ఇయాన్; ఇతర హ్యుందాయ్ కార్లపైనా డిస్కౌంట్స్
గత కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో, అమ్మకాలను పెంచుకునేందుకు దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా 'గోల్డెన్ వీల్స్' పేరిట తమ కార్లపై భారీ తగ్గింపులను, వివిధ ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది.
పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ ఐ20, ఎలాంట్రా, వెర్నా మోడళ్లపై అలాగే పెట్రోల్ వెర్షన్ ఐ10, ఇయాన్, యాక్సెంట్, సొనాటా, శాంటాఫే మోడళ్లపై కూడా కస్టమర్లకు బెనిఫిట్లను అందిస్తోంది. సరసమైన డీల్‌లో చక్కటి హ్యుందాయ్ కారును కొనాలనుకునే వారికి ఇదే అనువైన సమయం. హ్యుందాయ్ ఏయే మోడళ్లపై ఎంత మేర ప్రయోజనాలను అందిస్తుందో క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!
గమనిక: ఈ ఆఫర్లు నవంబర్ నెలాఖరు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి మరియు వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలరును సంప్రదించండి. ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు మారే ఆస్కారం ఉంది.

హ్యుందాయ్ ఇయాన్, ఐ10, శాంత్రో
హ్యుందాయ్ ఇయాన్‌పై కంపెనీ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. స్పెషల్ సెలబ్రేషన్ ఆఫర్‌లో భాగంగా ఈ కారును కేవలం రూ.2,49,900 ప్రారంభ ధరకే ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ నవంబర్ నెలలో ఫైనాన్స్ ద్వారా ఐ10 లేదా శాంత్రో కారును కొనుగోలు చేసిన కస్టమర్లకు తొలి ఐదు ఈఎమ్‌లను కంపెనీయే చెల్లిస్తుంది. ఈ నెలలో హ్యుందాయ్ కారు కొనేవారికి అష్షూర్డ్ గిఫ్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

హ్యుందాయ్ శాంత్రో
హ్యుందాయ్ గోల్డెన్ వీల్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న పెట్రోల్ కారు శాంత్రో కొనుగోలుపై రూ.56,215 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఐ10
హ్యుందాయ్ గోల్డెన్ వీల్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న పెట్రోల్ కారు ఐ10 కొనుగోలుపై రూ.56,215 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఐ20
ఈ ఆఫర్‌లో సందర్భంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 పెట్రోల్ వెర్షన్ కొనుగోలుపై రూ.38,000 బెనిఫిట్లను, డీజిల్ వెర్షన్ కొనుగోలుపై రూ.43,000 బెనిఫిట్లను పొందవచ్చు.

హ్యుందాయ్ వెర్నా
ఈ ఆఫర్‌లో భాగంగా హ్యుందాయ్ అందిస్తున్న మిడ్ సైజ్ సెడాన్ వెర్నా పెట్రోల్ వెర్షన్ కొనుగోలుపై రూ.30,000 బెనిఫిట్స్, డీజిల్ వెర్షన్ కొనుగోలుపై రూ.45,000 బెనిఫిట్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఎలాంట్రా
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రా పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ కొనుగోలుపై రూ.75,000 బెనిఫిట్లను పొందవచ్చు.

హ్యుందాయ్ సొనాటా
హ్యుందాయ్ గోల్డెన్ వీల్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ సొనాటాను 4.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ శాంటాఫే
హ్యుందాయ్ గోల్డెన్ వీల్స్ ఆఫర్ సందర్భంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫేను 4.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








