స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న పాపులప్ హ్యాచ్‌బ్యాక్‌లో 'ఐ10'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా హ్యుందాయ్ ఐ10 కార్లు అమ్ముడుపోవటంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన సరికొత్త స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ విడుదల చేసింది. 'ఐటెక్ ఐ10' (iTech i10) అనే పేరుతో హ్యుందాయ్ అందిస్తున్న స్పెషల్ ఎడిషన్‌లో లభ్యమయ్యే స్పెషల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
* స్పోర్టీ ఇంటీరియర్స్
* రెడ్ అండ్ బీజ్ కలర్ సీట్ కవర్స్
* రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా
* క్యాబిన్ రియర్ వ్యూ మిర్రర్‌పై ఎలక్ట్రో క్రోమిక్ ఫంక్షన్
* ఐటెక్ బాడీ గ్రాఫిక్స్
* స్టీరింగ్‌కు అమర్చబడిన బ్లూటూత్ డివైజ్
* ఈ స్పెషల్ ఎడిషన్ ఐ10 కేవలం 1.1 లీటర్ ఎరా, 1.2 లీటర్ మాగ్నా వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది.
* ఇది వైట్, రెడ్ బాడీ కలర్స్‌తో మాత్రమే లభ్యమవుతుంది.
స్పెషల్ ఎడిషన్ ఐటెక్ ఐ10 ధరలు ఇలా ఉన్నాయి:
- హ్యుందాయ్ ఐ10 ఎరా 1.1, క్రిస్టల్ వైట్ (సాలిడ్) - రూ.4.24 లక్షలు
- హ్యుందాయ్ ఐ10 ఎరా 1.1, గార్నెట్ రెడ్ (మెటాలిక్) - రూ.4.27 లక్షలు
- హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2, క్రిస్టల్ వైట్ (సాలిడ్) - రూ.4.57 లక్షలు
- హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2, గార్నెట్ రెడ్ (మెటాలిక్) - రూ.4.60 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా హ్యుందాయ్ ఐ10 కార్లు అమ్ముడుపోవటంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన సరికొత్త స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ విడుదల చేసింది.

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
రెడ్ అండ్ బీజ్ కలయికతో కూడిన స్పోర్టీ ఇంటీరియర్స్

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
క్యాబిన్ రియర్ వ్యూ మిర్రర్‌పై ఎలక్ట్రో క్రోమిక్ ఫంక్షన్‌తో కూడిన రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
స్టీరింగ్ వీల్‌కు అమర్చబడిన బ్లూటూత్ డివైజ్

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
స్పెషల్ ఎడిషన్ ఐటెక్ ఐ10 బాడీ గ్రాఫిక్స్

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
రెడ్ అండ్ బీజ్ సీట్ కవర్స్

స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్లు
స్పెషల్ ఎడిషన్ ఐ10 కేవలం 1.1 లీటర్ ఎరా, 1.2 లీటర్ మాగ్నా వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది వైట్, రెడ్ బాడీ కలర్స్‌తో మాత్రమే లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








