మహీంద్రా ప్లాంటులో సమ్మె, 500 యూనిట్ల ఉత్పత్తి నష్టం

By Ravi

Mahindra Plant
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రాకు కూడా సమ్మె సెగలు వదిలిపెట్టలేదు. కంపెనీకు చెందిన నాసిక్‌ యూనిట్‌లో ఓ కార్మికుడిని సస్పెండ్‌ చేయడంతో సుమారు 3,000 మంది కార్మికులు పనులు మానేసి ఆందోళనకు దిగారు. ఆదివారం నాడు నాలుగు గంటల పాటు ఉత్పతి నిలిపివేయడంతో మంగళవారం నాడు సాయంత్రం యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ శిండేను మహీంద్రా అండ్ మహీంద్రా యాజమన్యాం సస్పెండ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో, సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు పని నిలిపివేయడంతో ఉత్పత్తిపై ప్రభావంచూపిందని కార్మిక నాయకుడు ఒకరు తెలిపారు. ఎమ్ అండ్ ఎమ్ నాసిక్‌ ప్లాంట్‌ యూనియన్‌ అధ్యోఉడు శిరిష్‌ భావ్‌సార్‌ మరియు ప్రవీణ్‌ శిండేలతో పాటు యూనియన్ నాయకులంతా సోమవారం నుంచి నాసిక్‌లోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

కాగా.. మార్చి 5, 2013 సాయంత్రం 6.00 గంటల నుండి జరుగుతున్న ఈ టూల్‌డైన్ సమ్మె కారణంగా, దాదాపు 500 యూనిట్ల ఉత్పత్తి నష్టం వాటిళ్లందని, అయితే మరో మూడు వారాలకు సరపడా స్టాక్ తమ వద్ద ఉన్నందును అమ్మకాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. సమ్మెను విరమింపజేసేందుకు యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఇది ఓ కొలిక్కి వచ్చే ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా నాసిక్ ప్లాంటు యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 7, 2013, 10:47 [IST]
English summary
Mahindra and Mahindra would like to place on record that the tool down strike by employees of its Nashik plant which started on March 5, 2013 at 6:00PM is currently continuing. The company has had a production loss of around 500 vehicles till date which currently will have no immediate impact on sales as it has 3 weeks stock in the pipeline.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+