సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ - వీడియో
మారుతి సుజుకి నిలిపి వేసిన ఏ-స్టార్, ఎస్టిలో మోడళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు అలాగే బోరింగ్ ఆల్టో (1000సీసీ వెర్షన్)కు కొత్త రూపాన్ని ఇచ్చేందుకు ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ 'ఏ:విండ్' (A:Wind) కాన్సెప్ట్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 30వ అంతర్జాతీయ మోటార్ ఎక్స్ 2013లో ఈ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని మారుతి సుజుకి తమ సరికొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేయనుంది. 'గ్లోబల్ కాంపాక్ట్ కారుగా ఇది ఏ-సెగ్మెంట్‌కు తాజా గాలి (విండ్)ని తీసుకువస్తుందని, అందుకే దీనికి ఏ:విండ్ అనే పేరును పెట్టామని'ని సుజుకి పేర్కొంది. డైనమిక్ బాడీ, విశాలమైన క్యాబిన్, నాణ్యత అనే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఏ:విండ్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు.
సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ కారు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఈ లోపుగా సుజుకి ఏ:విండ్ ఫస్ట్ లుక్‌ను క్రింది వీడియోలో వీక్షించండి.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/1bfyH2x3HZE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








