సుజుకి కాంపాక్ట్ ఎస్‌యూవీలో స్వంత డీజిల్ ఇంజన్

By Ravi

భారత మార్కెట్ కోసం మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని (ఎక్స్ఏ-ఆల్ఫా లేదా సుజుకి ఐవి-4) అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. ఈ విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి నుంచి రానున్న ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో బయటి (ఫియట్) నుంచి గ్రహించిన ఇంజన్‌ను కాకుండా, తామే స్వయంగా అభివృద్ధి చేసిన ఇంజన్‌ను ఉపయోగించాలని సుజుకి నిర్ణయించింది.

సుజుకి ఇప్పటికే 800సీసీ (0.8 లీటర్) నుంచి 1600సీసీ (1.6 లీటర్) సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో తక్కువ సామర్థ్యం కలిగిన (800సీసీ) ఇంజన్లను తేలికపాటి వాణిజ్య వాహనాల్లోను, కాంపాక్ట్ కార్లలోను ఉపయోగించనున్నారు. అలాగే 1.5 లీటర్ లేదా 1.6 లీటర్ డీజిల్ ఇంజన్లను ఫియట్ కొత్త కార్లలో (ప్రత్యేకించి కొత్తగా రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలో) ఉపయోగించనున్నట్లు సమాచారం.

Suzuki Diesel Engine Development Details Emerge

ప్రస్తుతం సుజుకి డీజిల్ ఇంజన్ల కోసం ఫియట్‌పై ఆధారపడుతోంది. ఫియట్ నుంచి గ్రహిస్తున్న 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను మారుతి సుజుకి తయారు చేస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా ఎమ్‌పివిలలో ఉపయోగిస్తుంది. అయితే, ఇకపై సుజుకి డీజిల్ ఇంజన్ల కోసం ఇతరులపై ఆధారపడటం మానేసి, తామే స్వయంగా డీజిల్ ఇంజన్లను తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది.

సుజుకి తమ ఎల్‌సివి (వై9టి కోడ్ నేమ్) కోసం తయారు చేస్తున్న 800సీసీ ఇంజన్లను రెండింటిని జతచేయగా వచ్చే 1600సీసీ ఇంజన్‌ను రీట్యూన్ చేసి, దాని సామర్థ్యాన్ని 100సీసీ తగ్గించి 1500సీసీ (1.5లీటర్) ఇంజన్‌గా మార్చనున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో టాక్స్ బెనిఫిట్లను పొందేందుకే సుజుకి ఈ ప్రయత్నం చేస్తోంది. (భారత మార్కెట్లో 1.5 లీటర్ అంత కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం మరియు పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న వాహనాలను చిన్న కార్లుగా పరిగణించి, వాటిపై ఎక్సైజ్ రాయితీలను అందిస్తారు).

సుజుకి తయారు చేస్తున్న ఈ కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను తొలిసారిగా, ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌‌యూవీలో ఉపయోగించనున్నారు. గతంలో సుజుకి ఆవిష్కరించిన ఎక్స్ఏ-ఆల్ఫా కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని, వైబిఏ అనే కోడ్‌నేమ్‌తో ఓ బుజ్జి ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. ఇది మార్కెట్లోకి రావాలంటే, 2015-16 వరకు ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2013, 16:13 [IST]
English summary
Suzuki is said to be developing a new range of diesel engines. These will be the Japanese automaker's first ever self developed diesel powerplants, which makes it a very important development in Suzuki's history.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+