ఇండోనేషియాలో విడుదలైన ఆటోమేటిక్ ఎర్టిగా ఎమ్‌పివి

ఇటీవలే థాయ్‌లాండ్ మార్కెట్లో ఆటోమేటిక్ వెర్షన్ ఎర్టిగాను విడుదల చేసిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇప్పుడు తాజాగా ఇండోనేషియా మార్కెట్లో ఎర్టిగా ఎమ్‌పివిని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగాను కూడా కంపెనీ ఇండినేషియా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఎర్టిగాను సుజుకి భారత్ నుంచి సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో విదేశాలకు దిగుమతి చేసుకొని, అక్కడి మార్కెట్లలో అసెంబ్లింగ్ నిర్వహిస్తోంది.
ఇండోనేషియా మార్కెట్లో విడుదలైన ఎర్టిగా ఎమ్‌పివి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. సుజుకి రిట్జ్, స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్ మోడళ్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సునే మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ వేరియంట్‌లోను ఉపయోగించారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఈ ఆటోమేటిక్ ఎర్టిగా ఎమ్‌పివిని భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








