జనవరి 2014లో సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 విడుదల

By Ravi

జపాన్‌‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్లో ఓ సరికొత్త 250సీసీ బైక్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, సుజుకి మోటార్‌సైకిల్ తమ 'ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) బైక్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయనుంది.

ఈ విషయాన్ని కంపెనీ అధికారులే స్వయంగా వెల్లడించారు. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే నెల (జనవరి 2014)లో కొత్త 250సీసీ బైక్‌ (ఇనాజుమా జిడబ్ల్యూ 250)ను విడుదల చేస్తామని, అలాగే ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఆయన అన్నారు.

Suzuki Inazuma GW250

సుజుకి ఇనాజుమా 250 లేదా జిడబ్ల్యూ 250గా ఈ పిలిచే ఈ బైక్‌ను దేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ధర విషయానికి వస్తే రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 14, 2013, 15:40 [IST]
English summary
Suzuki Motorcycle India Limited was rumored to launch its 250cc segment naked street motorcycle, the Inazuma 250 in India earlier this year. But that never happened. Now, official confirmation about the same has come from Atul Gupta, executive vice-president, SMIL himself.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+