టాటా ఇండికా ఈవి2 డీజిల్ ధరలో రూ.45,000 కోత!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే హ్యాచ్‌బ్యాక్ 'టాటా ఇండికా ఈవి2' ధరలో కంపెనీ భారీ కోతను విధించింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ ఈ హ్యాచ్‌బ్యాక్‌పై ఏకంగా రూ.45,000 తగ్గింపును అందిస్తుంది. ఈ తగ్గింపుతో ఏసి, పవర్ స్టీరింగ్ ఆప్షన్ కలిగిన టాటా ఇండికా ఈవి2 డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.

తాజా తగ్గింపు తర్వాత టాటా ఇండికా ఈవి2 బిఎస్4 వేరియంట్ ప్రారంభ ధర రూ.4.13 లక్షలుగా ఉండగా, బిఎస్3 వేరియంట్ ప్రారంభ ధర రూ.3.87 లక్షలుగా ఉన్నాయి. గతంలో ఏసి, పవర్ స్టీరింగ్ కలిగిన ఈ బిఎస్4 వేరియంట్ ప్రారంభ ధర రూ.4.58 లక్షలుగా ఉండేది. అయితే ప్రస్తుతం ఇది రూ.4.13 లక్షలకే లభ్యమవుతోంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

డీజిల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,396 సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 70 పిఎస్‌లవ శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 25 కిలోమీటర్ల మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది. డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, స్టయిలిష్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ట్రిపిల్‌-స్టెప్‌ క్రోమ్‌ టిప్పెడ్‌ గ్రిల్‌, అభివృద్ధి చేసిన స్టాప్‌ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్‌, ఆకర్షణీయమైన డెకాల్స్‌ వంటి ఫీచర్లు కొత్త ఇండికా ఈవి2 సొంతం.

Tata Indica eV2 Diesel Price Slashed

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2013, 14:50 [IST]
English summary
Tata Motors is offering huge discount on the Indica eV2 diesel hatchback. Tata Indica eV2 diesel hatchback price has been slashed by a staggering Rs 45,000. The new price for BSIV variant starts from Rs 4.13 lakhs and Rs 3.87 lakhs for BSIII model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+