టాటా కార్ల ధరల తగ్గింపు, ఎస్‌యూవీల ధరల పెంపు

By Ravi

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ఇండికా, మాంజా రేంజ్ ప్యాసింజర్ కార్ల ధరలను రూ.50,000 వరకూ తగ్గిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ తమ ఇండికా, మాంజా రేంజ్ కార్లపై రూ.29,000 నుంచి రూ.50,000 మధ్యలో తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

అయితే, యూనియన్ బడ్జెట్ 2013-14లో పెద్ద ఎస్‌యూవీలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంఖాన్ని 30 శాతనికి పెంచిన నేపథ్యంలో, కంపెనీ అందిస్తున్న సుమో, సఫారీ, ఆరియా రేంజ్ ఎస్‌యూవీల ధరలను రూ.35,000 వరకూ పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ వివరించింది. టాటా సుమోపై రూ.7,500, టాటా సఫారీ మరియు ఆరియాలపై రూ.11,000 చొప్పున పెంపును విధించామని, బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంఖం పెంపు తర్వాత ఎస్‌యూవీలపై మొత్తం రూ.20,000 నుంచి రూ.35,000 మధ్యలో పెంపును విధించామని కంపెనీ తెలిపింది.

కాగా తాము అందిస్తున్న ప్రజల కారు టాటా నానో ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇండికా రేంజ్ ధరలు రూ.3.29 లక్షల నుంచి 4.88 లక్షల రేంజ్‌లో ఉండగా, మాంజా సెడాన్ ధరలు రూ.5.71 లక్షల నుంచి రూ.8.80 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. అలాగే, సుమో రేంజ్ ధరలు రూ.6.01 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, సఫారీ ధర రూ.8.62 లక్షల నుంచి, ఆరియా ధరలు రూ.10.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభం అవుతున్నాయి.

టాటా ఇండికా

టాటా ఇండికా

ఇండికా రేంజ్ కార్లపై రూ.29,000 వరకూ తగ్గింపు

టాటా మాంజా

టాటా మాంజా

మాంజా రేంజ్ కార్లపై రూ.50,000 వరకూ తగ్గింపు

టాటా నానో

టాటా నానో

ప్రజల కారు టాటా నానో ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు

టాటా సుమో

టాటా సుమో

టాటా సుమో రేంజ్ ఎస్‌యూవీలపై రూ.7500 వరకూ పెంపు

టాటా సఫారీ

టాటా సఫారీ

టాటా సఫారీ రేంజ్ ఎస్‌యూవీలపై రూ.11,000 వరకూ పెంపు

టాటా ఆరియా

టాటా ఆరియా

టాటా ఆరియా రేంజ్ ఎస్‌యూవీలపై రూ.11,000 వరకూ పెంపు


ఇటీవలి నెలల్లో టాటా మోటార్స్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 2012తో పోల్చుకుంటే ఫిబ్రవరి 2013 నెలలో కంపెనీ దేశీయ అమ్మకాలు 69.53 శాతం క్షీణించి కేవలం 10,613 యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో పెద్ద ఎస్‌యూవీలపై ఎక్సైజ్ సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి పెంచిన విషయం తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2013, 11:12 [IST]
English summary
Auto major Tata Motors has slashed prices of its Indica and Manza range of passenger cars by up to Rs 50,000 to boost the sales volume. The company, however, increased the prices of its sports utility vehicle range, comprising Sumo, Safari and Aria, by up to Rs 35,000 following the excise duty hike in the Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+