ఆగస్టులో 49,611 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్

ప్యాసింజర్ వాహనాలు
ఆగస్ట్ 2013లో టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 11,564 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో నానో/ఇండికా/ఇండిగో రేంజ్ వాహనాలు 8,761 యూనిట్లుగా ఉండగా, సుమో/సఫారీ/ఆరియా/వెంచర్ రేంజ్ అమ్మకాలు 2,803 యూనిట్లుగా ఉన్నాయి.
వాణిజ్య వాహనాలు
ఆగస్ట్ 2013 నెలలో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 33,153 యూనిట్లుగా నమోదు కాగా, ఇందులో ఎల్‌సివి రేంజ్ వాహనాలు 24,904 యూనిట్లుగాను, మీడియం అండ్ హెవీ రేంజ్ వాహనాలు 8,249 యూనిట్లుగాను నమోదయ్యాయి.
ఎగుమతులు
ఈ సమయంలో టాటా మోటార్స్ ఎగుమతులు 4,894 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








