గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్‌ను ప్రారంభించిన టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కార్లపై 'సువర్ణ' ఆఫర్లను అందిస్తోంది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకునేందుకు గాను వివిధ మోడళ్లపై టాటా మోటార్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్' పేరుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపైన్ ఏప్రిల్ 30 వరకూ చెల్లుబాటులో ఉండనుంది.
టాటా గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా, ఏప్రిల్ 30 లోపుగా టాటా కార్లను కొనుగోలు చేసే వారికి ఆకర్షనీయమైన నగదు ప్రయోజనాలతో పాటుగా ఓ ఉచిత బంగారు నాణేన్ని (గోల్డ్ కాయిన్)ను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో టాటా సుమో, టాటా సఫారీ డైకర్, టాటా నానో, టాటా మాంజా, టాటా విస్టా డి90 కార్లను కొనుగోలు చేసే వారు ఈ గోల్డ్ కాయిన్ ఆఫర్‌ను పొందవచ్చు.
టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్ వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కార్లపై 'సువర్ణ' ఆఫర్లను అందిస్తోంది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకునేందుకు గాను వివిధ మోడళ్లపై టాటా మోటార్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్' పేరుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపైన్ ఏప్రిల్ 30 వరకూ చెల్లుబాటులో ఉండనుంది.

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
టాటా మోటార్స్ అందిస్తున్న సుమో గోల్డ్ ఎస్‌యూవీపై రూ.22,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని మరియు ఉచిత గోల్డ్ కాయిన్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
టాటా సఫారీ డైకర్ ఎస్‌యూవీపై రూ.22,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని మరియు ఉచిత గోల్డ్ కాయిన్‌ను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
కంపెనీ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోపై రూ.7,500 గరిష్ట నగదు ప్రయోజనాన్ని మరియు ఉచిత గోల్డ్ కాయిన్‌ను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ మాంజాపై రూ.22,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని మరియు ఉచిత గోల్డ్ కాయిన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్ గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్
టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన పవర్‌ఫుల్ విస్టా డి90 కారుపై కూడా రూ.17,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని మరియు ఉచిత గోల్డ్ కాయిన్‌ను కంపెనీ అందిస్తోంది.

Click it and Unblock the Notifications