ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా ఫాల్కన్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్లు విడుదల

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ 'ప్రాజెక్ట్ ఫాల్కన్' పేరిట రెండు కొత్త కార్లను అభివృద్ధి చేస్తోంది. ఫాల్కన్ కోడ్‌నేమ్‌తో కంపెనీ తయారు చేస్తున్న సరికొత్త హ్యాచ్‌బ్యాక్ మరియు ఓ కాంపాక్ట్ సెడాన్ కార్లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించనుంది.

టాటా మోటార్స్ ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని ఈ కొత్త కార్లను తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాటా మోటార్స్ ఇదే ప్లాట్‌ఫామ్‌పై విస్టా హ్యాచ్‌బ్యాక్, మాంజా సెడాన్ కార్లను తయారు చేస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, టాటా మోటార్స్ నుంచి కొత్తగా రానున్న ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న విస్టా, మాంజా సెడాన్ల స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇవి డిజైన్ పరంగా ఒకే విధంగా ఉంటాయో, లేక మారుతాయో అనేది వేచి చూడాల్సి ఉంది.


టాటా తయారు చేస్తున్న కొత్త హ్యాచ్‌బ్యాక్ కోడ్‌నేమ్ 'ఫాల్కన్ 4'. ఈ కారులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే టాటా జెటాను ఆధారంగా చేసుకొని ఇందులో ఓ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించనున్నారు. ఈ కారును టాటా యూరోపియన్ డిజైన్స్ స్టూడియోల్ అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, టాటా ఫాల్కన్ 4 హ్యాచ్‌బ్యాక్ యూరోపియన్ స్టైల్ కార్ల డిజైన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.
Manza

ఇకపోతే టాటా మోటార్స్ అభివృద్ధి చేస్తున్న మరో కాంపాక్ట్ సెడాన్ కోడ్‌నేమ్ ఫాల్కన్ 5. ఇందులో కూడా ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను, అలాగే ఓ పవర్‌‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది కూడా సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండి, పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండి, ఈ సెగ్మెంట్లోని మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ఈ రెండు కొత్త టాటా కార్లు వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి రావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2013, 12:33 [IST]
English summary
‘Project Falcon' is the codename being used by Tata Motors to designate its project that will bring the first totally new vehicle from the Indian manufacturer in years. The first two products originating from Project falcon will be a hatchback and a compact sedan, both of which will be on display at the Indian Auto Expo in Feb. 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+