ఏప్రిల్ నెలలో 7 శాతం క్షీణించిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఏప్రిల్ 2013 నెలలో మొత్తం 28,874 యూనిట్లను విక్రయించగా, క్రితం సంవత్సరం ఇదే సమయంలో 25,143 యూనిట్లు విక్రయించింది. ఈ సమయంలో లగ్జరీ సెడాన్ జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 5,334 యూనిట్లుగా ఉండగా, లగ్జరీ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ బ్రాండ్ అమ్మకాలు 23,540 యూనిట్లుగా ఉన్నాయి.
ప్యాసింజర్ కార్ల విషయానికి వస్తే ఏప్రిల్ 2013 నెలలో మొత్తం 41,272 యూనిట్లు అమ్ముడుపోగా, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో 49,369 యూనిట్లుగా ఉన్నాయి. ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే అమ్మకాలు గడచిన నెలలో 39,969 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, ఏప్రిల్ 2012 నెలలో ఇవి 38,008 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








