జులై నెలలో 14 శాతం తగ్గిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

By Ravi

Tata Motors
గడచిన జులై నెలలో టాటా మోటార్స్ గ్రూప్ గ్లోబల్ హోల్‌సేల్స్ (జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిపి) 87,566 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం అమ్మకాలు 3,35,067 యూనిట్లుగా నమోదయ్యాయి.

జూలై 2013లో టాటా, టాటా దేవూ, టాటా హిస్పానో కార్రోసెరా రేంజ్ అన్ని వాణిజ్య వాహనాల గ్లోబల్ హోల్‌సేల్స్ 40,882 యూనిట్లుగా నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం వాణిజ్య వాహనాల హోల్‌సేల్స్ 1,61,088 యూనిట్లుగా నమోదయ్యాయి.

అలాగే గడచిన నెలలో అన్ని ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 46,684 యూనిట్లుగా నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్స్ 1,73,979 యూనిట్లుగా ఉన్నాయి.

జులై 2013లో టాటా ప్యాసింజర్ వాహనాల గ్లోబల్ హోల్‍‌సేల్స్ 11,522 యూనిట్లుగా నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇవి మొత్తం 48,197 యూనిట్లుగా నమోదయ్యాయి.

గడచిన నెలలో జాగ్వార్ ల్యాంజ్ రోవర్ గ్లోబల్ హోల్‌సేల్స్ 35,162 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో కేవలం జాగ్వార్ వాహనాలు 7,174 యూనిట్లుగా ఉన్నాయి. ఏకీకృత అమ్మకాలు 25,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ల్యాండ్ రోవర్ అమ్మకాలు 27,988 యూనిట్లుగాను, ఏకీకృత అమ్మకాలు 1,00,031 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తమ్మీద జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఏకీకృత అమ్మకాలు 1,25,782 వాహనాలుగా నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2013, 17:23 [IST]
English summary
The Tata Motors Group global wholesales in July 2013, including Jaguar Land Rover, were 87,566 nos. Cumulative wholesales for the fiscal were 335,067 nos.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+