టాటా, ఇస్రోల నుంచి భారతదేశపు తొలి ఫ్యూయెల్ సెల్ బస్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో - ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లు తొలిసారిగా భారతదేశంలో కెల్లా మొట్టమొదటి పూర్తి పర్యావరణ సాన్నిహిత్యమైన బస్సును రూపొందించాయి. ఈ బస్సు హైడ్రోజన్ (నీరు) ఇంధనంపై పనిచేస్తుంది. ఇదొక సిఎన్‌జి రకం బస్సు.
ఈ బస్సు పైభాగంలో హైడ్రోజన్‌ను అధిక పీడనం వద్ద బాటిళ్లలో నిక్షిప్తం చేస్తారు. ద్రవరూప హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయటం, నిక్షిప్తం చేయటం మరియు హ్యాండ్లింగ్ చేయటంలో ఇస్రో వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. సేఫ్టీ విషయంలో కూడా ఇస్రో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంది.
బస్సు రూపకల్పనను టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం చేపట్టగా, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ తయారీకి కాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో అందజేసింది. ఈ బస్సుకు సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్లను, సాధారణ స్పెసిఫికేషన్లను ఇస్రో బృందం అభివృద్ధి చేసింది.
భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్యూయెల్ సెల్ బస్సును అభివృద్ధి చేశామని ఇరు సంస్థలకు చెందిన ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గాంధీ మరియు టాటా మోటార్స్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డా. ఎమ్ రాజాలు వెల్లడించారు. ఈ బస్సు ఎలాంటి కర్భన ఉద్ఘాలను విడుదల చేయదని, ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనదని, ఇది నీటితో నడుస్తుందని ఆయన చెప్పారు.



Click it and Unblock the Notifications








