టాటా మోటార్స్ జెంషెడ్‌పూర్ ప్లాంటులో ఉత్పత్తి బంద్!

By Ravi

Tata Aria
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌ తమ జెంషడ్‌పూర్ ప్లాంటులో 11 రోజుల పాటు ఉత్ప త్తి నిలిపి వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లాంట్‌ను మెయిన్‌టెనెన్స్‌ కార్యకలాపాల కోసం ను మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6వ తేది వరకు మూసి వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్లాంట్‌లోని పెయింట్‌ షాప్‌లో మెయిన్‌టెనెన్స్‌ పాటు యంత్రాలను మెయింటెనెన్స్‌ చేసేందుకే ఈ ప్లాంటును మూసి వేస్తున్నామని టాటా మోటార్స్ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్ దేబాసిస్‌ రే తెలిపారు.

ప్లాంటులో రోజువారీ ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మెయింటనెన్స్ కార్యకలాపాలు నిర్వహించడం కష్టమని, అందుకే ఉత్పత్తిని నిలిపి వేసిన తర్వాత మెయింటెనెన్స్‌ చేస్తామని ఆయన అన్నారు. వాస్తవానికి గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో అమ్మకాలు గరిష్టంగా 12 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 25.7 శాతం క్షీణించాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, కొందరు కార్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను తగ్గించుకుంటుంగా, మరికొన్ని కంపెనీలు అమ్మకాలను పెంచుకనేందుకు, పేరుకుపోయిన స్టాక్‌లను క్లియర్ చేసుకునేందుకు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. టాటా మోటార్స్ అందిస్తున్న నానో అమ్మకాలు కూడా భారీగా తగ్గడంతో, నానో ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా 80 శాతం మేర తగ్గించి వేసింది. కంపెనీ అందిస్తున్న ఆరియా క్రాసోవర్‌పై కూడా రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 11:28 [IST]
English summary
India's leading automobile company Tata Motors will undertake a 11-day shutdown to carry out maintenance of equipments at its Jamshedpur plant from March 27, a senior company official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+