నేడు టాటా మోటార్స్ నుంచి 4 కొత్త కార్లు విడుదల

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జూన్ 19న సరికొత్త కార్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌‍‌స్పార్క్ ఈనెల ఆరంభంలోనే ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. మేము ప్రచురించినట్లుగా, కంపెనీ నేడు (జూన్ 19, 2013, గురువారం) నాలుగు అప్‌డేటెడ్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఈ కొత్త మోడళ్లన్నీ కూడా ప్రస్తుతం టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్లు కావటం విశేషం. టాటా మోటార్స్ అందిస్తున్న సుమో గోల్డ్, ఇండిగో ఈసిఎస్, నానో మరియు ఇండికా మోడళ్లలో రిఫ్రెష్ చేయబడిన అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కంపెనీ నేడు సాయంత్రం 3 గంటలకు విడుదల చేయనుంది.

ఈ అప్‌డేట్ మోడళ్ల విడుదలకు సంబంధించి కంపెనీ తమ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలలో ఓ టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్త టాటా సుమో గోల్డ్, టాటా ఇండిగో ఈసిఎస్, టాటా నానో మరియు టాటా ఇండికా మోడళ్లను గమనించవచ్చు. ఇవన్నీ 2013 మోడల్స్. ఈ కొత్త మోడళ్లలో ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ పరంగా స్వల్పంగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

ఈ కొత్త టాటా కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈలోపుగా టీజర్ ఇమేజ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Tata Cars

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2013, 14:20 [IST]
English summary
As we reported earlier this month, Tata Motors is all set to roll out updated Tata Nano, Indigo eCS, Sumo Gold and Indica facelift versions today. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+