దీపావళి లోపుగా పెరగనున్న టాటా కార్ల ధరలు

By Ravi

Tata Motors May Hike Car Prices Before Diwali
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌కు ముందుగానే ధరలు పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) అంకుష్ అరోరా గురువారం సూచనప్రాయంగా వెల్లడించారు.

"రానున్న పండుగ సీజన్‌కు ముందు అన్ని రకాల ఉత్పత్తులను పెంచే అవకాశం ఉండొచ్చ"ని ఆయన చెప్పారు. అయితే, ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలను పెంచే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో మొత్తం కార్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 1,53,450 యూనిట్ల నుంచి 1,39,632 యూనిట్లకు పడిపోయాయి.

ఇదే సమయంలో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అమ్మకాలు 8.17 శాతం క్షీణించగా, హ్యుందాయ్ అమ్మకాలు కూడా మార్జినల్‌గా తగ్గాయి. కానీ టాటా మోటార్స్ అమ్మకాలు భారీగా 29.17 శాతం క్షీణించి 13,595 యూనిట్ల నుంచి 9,628 యూనిట్లకు పడిపోయాయి.

గడచిన ఏప్రిల్ నెల నుంచి టాటా మోటార్స్ కార్ల అమ్మకాలలో వృద్ధి కనబరచలేదు. ఇప్పటి వరకు కంపెనీ సగటు అమ్మకాలు 35 శాతం వరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో, అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నించాల్సింది పోయి ఉత్పత్తుల ధరలను పెంచితే, అమ్మకాలపై అది మరింత ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2013, 10:09 [IST]
English summary
Despite facing continued pressure on sales, which have been declining for months, the country's largest auto major Tata Motors Thursday said it is thinking of raising prices before the forthcoming festive season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+