విస్టా డి90పై రూ.45,000 బెనిఫిట్లను అందిస్తున్న టాటా
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేసిన పవర్‌ఫుల్ 'టాటా విస్టా డి90' కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ భారీ ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. గడచిన కొద్ది నెలలుగా దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులపై వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ కూడా తమ విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌పై రూ.45,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.
ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించండి. ఇక టాటా విస్టా డి90లో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన రిఫైన్డ్ 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

టాటా విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌లో విశాలమైన డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, స్టీరింగ్ వీల్‌పై అమర్చిన ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా, ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఇన్ఫినిటీ కాంట్రాస్ట్ రూఫ్, 2-టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎమ్, వన్-షాట్ పవర్ డౌన్, డ్రైవర్ సైడ్ విండో, టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, బ్లూ 5 టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయెల్ , సహారా బీజ్, ఎబోనీ బ్లాక్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, హైట్ అడ్జస్టబల్ సీట్ విత్ లంబార్ సపోర్ట్, 60:40 ఫ్లిప్ ఫ్లాప్ రియర్ సీట్ (ఫోల్డబిల్), రియర్ డిమిస్టర్, ఇంటెలిజెంట్ వైపర్ ఫీచర్లు విస్టా డి90 సొంతం.


Click it and Unblock the Notifications








