ఇండికా ఈవి2 డీజిల్ కారు ధరను తగ్గించిన టాటా మోటార్స్

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న 25 కెఎఎమ్‌పిఎల్ మైలేజ్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్ 'ఇండికా ఈవి2' ధరలో మరోసారి కోతను విధిచింది. టాటా ఇండికా ఈవి2 (ఎల్ఎస్ వేరియంట్) ఇప్పుడు కేవలం రూ.4.17 లక్షలకే లభ్యమవుతోంది. గతంలో టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను రూ.4.63 లక్షలకు విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతుండటంతో పెట్రోల్ కార్ల అమ్మకాలతో పాటుగా డీజిల్ కార్ల అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి.

ఈ నేపథ్యంలో, డీజిల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ తమ ఇండికా ఈవి2పై రూ.46,000 తగ్గింపును ఆఫర్ చేస్తోంది. తమ డీజిల్ కారును మారుతి సుజుకి అందిస్తున్న పెట్రోల్ కారు వ్యాగన్ఆర్‌తో పోల్చుతూ కంపెనీ ఓ ప్రకటను కూడా రూపొందించింది. పెట్రోలు కారు ధరకే డీజిల్ కారును అందిస్తున్నామని టాటా మోటార్స్ ప్రకటించింది.

డీజిల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,396 సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 70 పిఎస్‌లవ శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 25 కిలోమీటర్ల మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇదిలా ఉండగా, టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లపై రూ.29,000 వరకూ, మాంజా రేంజ్ కార్లపై రూ.50,000 వరకూ తగ్గింపులను ఆఫర్ చేయటమే కాకుండా, తమ ప్రజల కారు టాటా నానో కోసం ప్రత్యేకంగా ఓ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

Tata Indica eV2

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2013, 11:18 [IST]
English summary
Tata Motors is offering huge discount on the Indica eV2 diesel hatchback. Tata Indica eV2 LS variant sees a price drop of 46,000 rupees. This car is now available at the price of INR 4.17 lakh (ex-showroom Bangalore).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+