జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఎన్ఏతో టాటా మోటార్స్ ఎస్‌యూవీ

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, గడచిన ఐదేళ్ల క్రితం దాదాపు దివాళా స్థాయికి చేరుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) భారీ మొత్తాన్ని చెల్లించి (2.8 బిలియన్ డాలర్లు) చెల్లించి కొనుగోలు చేసింది. ఈ డీల్‌తో జేఎల్ఆర్ దశ మారిపోయి, తిరిగి లాభాల బాటలోకి చేరుకుంది. ఇది టాటా మోటార్స్‌‌‌కు లాభాల పరంగా మంచి ఆదాయాలనే తెచ్చిపెట్టింది. అంతేకాకుండా, టాటా మోటార్స్ బ్రాండ్‌ను ప్రపంచానికి సుపరిచతం చేసేలా చేసింది.

సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, టాటా మోటార్స్ తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆస్తులను కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ తమ స్వంతానికి (టాటా మోటార్స్ ఉత్పత్తుల) కోసం ఉపయోగించుకోలేదు. అయితే, ఇప్పుడు టాటా మోటార్స్ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలిను విస్తరించుకునేందుకు గాను, జేఎల్ఆర్ సహకారంతో సరికొత్త ఎస్‌యూవీలను తయారు చేయాలని భావిస్తోంది. ఈ కొత్త ఉత్పత్తుల జేఎల్ఆర్ ఉత్పత్తుల కన్నా తక్కువ ధరకే లభించే ఆస్కారం ఉంది.

Tata JLR SUV

ప్రస్తుతం భారత్ వంటి ఆటోమొబైల్ మార్కెట్లలో యుటిలిటీ వాహనాలకు గిరాకీ ఉండటం అలాగే మార్కెట్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను (వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్) అందించేందుకు టాటా మోటార్స్ కృషి చేస్తుంది. అయితే, ఇవి మార్కెట్లోకి రావటానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, జేఎల్ఆర్ సహకారంతో రానున్న ఈ టాటా ఎస్‌యూవీల ధర రూ.10-15 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Sunday, September 29, 2013, 15:02 [IST]
English summary
In fact, it has been revealed, the first strides towards integrating JLR's expertise into Tata Motors have been taken. But the first resulting products, in the form of two Tata Motors SUVs will only come by 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+