స్వతహాగా అడ్వాన్స్డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనున్న టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నుంచి రోటీన్ వాహనాలు చూసి బోర్ కొట్టేసిందా..? అయితే, ఇకపై భవిష్యత్తులో రానున్న అన్ని టాటా మోటార్స్ కార్లను కంపెనీ అభివృద్ధి చేస్తున్న అధునాతన ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయనున్నారు. అడ్వాన్స్డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (ఏఎమ్‌పి)గా పిలిచే ఓ సరికొత్త వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ స్వతహాగా అభివృద్ధి చేస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా టాటా మోటార్స్ ఆర్ అండ్ డి ఛీఫ్ డా. టిమ్ లెవెర్టన్ ఓ మీడియా సంస్థతో తెలిపారు. టొయోటా, ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే అధునాత టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. మోడ్రన్ టెక్నాలజీ పరంగా ఈ సంస్థలతో పోల్చుకుంటే టాటా మోటార్స్ చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు.
ఉదాహరణకు, ఫోక్స్‌వ్యాగన్ తమ ఉత్పత్తులను పాపులర్ ఎమ్‌ఎల్‌బి మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తుంటే, రెనో-నిస్సాన్‌లు సిఎమ్ఎఫ్ ప్లాట్‌ఫామ్‌ను, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎఫ్ఏ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకొని అధునాత ఉత్పత్తులను తయారు చేస్తున్నాయు.

మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ అంటే ఏమిటి..?
మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ అంటే, ఒక కామన్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని విభిన్న వాహనాలను తయారు చేయటం. ఇలా చేయటం కోసం సదరు కామన్ వెహికల్ ప్లాట్‌ఫామ్ డిజైన్‌ను విభిన్న వాహనాలకు అనుగణంగా సాగదీయటం, కుదించటం వంటివి చేయటం జరుగుతుంది. దీని ప్రధానం ఉద్దేశ్యం ఉత్పత్తి ఖర్చు తగ్గించడం. అంతేకాకుండా, దీని వలన కొత్త వాహనాల అభివృద్ధి, ఉత్పత్తి వేగవంతమవుతుంది.
కాగా.. టాటా మోటార్స్ అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (ఏఎమ్‌పి) మోనోకాక్ నిర్మాణం కలిగి ఉంటుందని తెలుస్తోంది. భవిష్యత్తులో కంపెనీ తయారు చేయనున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, కాంపాక్ట్ ఎస్‌యూవీల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పెద్ద సైజు ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కుల కోసం మాత్రం కామ్ బాడీ-ఆన్-ల్యాడర్ ఛాసిస్‌ను ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications








