ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో వస్తున్న టాటా నానో కారు

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు టాటా నానోకు, ప్రపంచ స్థాయి ఇమేజ్‌ను కల్పించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకించి ఎగుమతి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, టాటా నానో కారు గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే, టాటా నానో కారులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)ను పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాటా మోటార్స్ ఇటీవలే ఆరియా ఎమ్‌పివి, సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ, విస్టా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను ఇండోనేషియా మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఈ మార్కెట్లలో టొయోటా, హోండా వంటి జపనీస్ కంపెనీలు అందిస్తున్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో, సదరు జపనీస్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నానో ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని టాటా మోటార్స్ యోచిస్తోంది.

Tata Nano

భారత మార్కెట్లో అంతంత మాత్రంగా అమ్ముడుపోతున్న నానోకు, ఇండోనేషియా మార్కెట్లో ఎలాంటి స్పంధన లభిస్తుందోనని టాటా మోటార్స్ అక్కడ ఓ మార్కెట్ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఇండేనేషియన్ నగరవాసులు ఆటోమేటిక్ కార్లంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలో, తమ చవక కారు టాటా నానోలో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను పరిచయం చేస్తే బాగుంటందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది నాటికి ఆటోమేటిక్ టాటా నానో ఇండోనేషియన్ రోడ్లపై పరుగులు తీసే ఆస్కారం ఉంది. భారత్‌లో కూడా నానో అమ్మకాలను పునరుద్ధరించుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగా, నానో కారులో పవర్ స్టీరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లను జోడించి, చీప్ కార్ ఇమేజ్‌ను పోగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సిఎన్‌జి వెర్షన్, డీజిల్ వెర్షన్ టాటా నానో కారును విడుదల చేసేందుకు కూడా కంపెనీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, September 23, 2013, 14:45 [IST]
English summary
Tata Motors flagship small car has not been doing too well in its home country, India. But the company will try out something totally different for Indonesian. Apparently, Tata Motors has conducted market studies in that country and has learnt the love for automatic cars its citizens share. Hence, an automatic variant of Nano, reports The Hindu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+