ఫేస్‌బుక్‌లో 30 లక్షల మంది అభిమానుం పొందిన నానో

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'ను కొనుగోలు చేసిన వారి కన్నా, ఫేస్‌బుక్‌లో నానో పేజ్‌ను లైక్‌ను కొట్టిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో టాటా నానో ఫ్యాన్స్ సంఖ్య 30 లక్షలను దాటింది. టాటా నానో ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‍‌ను ప్రారంభించి కేవలం 12 నెలలో ఇంతటి భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక కార్ బ్రాండ్‌గా టాటా నానో ఓ కొత్త రికార్డును సృష్టించింది. నానో ఎక్స్‌పెర్ట్ క్విజ్, డ్రైవ్ విత్ ఎమ్‌టివి, నానో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి పలు ఎఫ్‌బి ఫన్ అప్లికేషన్ల సాయంతో టాటా నానో డిజిటల్ మీడియాలో ఇంత మంది అభిమానాన్ని సొంతం చేసుకోగలిగింది.

రతన్ టాటా మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేస్తూ, టాటా మోటార్స్ ద్వారా మార్కెట్లో ప్రవేశపెట్టిన టాటా నానో అమ్మకాలు కంపెనీ ఆశించిన రీతిలో సాగకపోయినప్పటికీ, నిరుత్సాహకర ఫలితాలను మాత్రం కనబరచలేదనే చెప్పాలి. నవంబర్ 2011లో టాటా మోటార్స్ తమ నానో కారును అప్‌గ్రేడ్ చేసి 2012 ఎడిషన్ పేరుతో పాత ధరకే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు కాస్తంత జోరందుకున్నాయి. పాత టాటా నానో ఉపయోగించిన 624 సీసీ ఇంజన్‌ను రీట్యూన్ చేసి 2012 నానోలో ఉపయోగించారు.

Tata Nano

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానో 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఈ బుజ్జి కారు లీటరు పెట్రోలుకు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది 10 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా నానోలో రూ.25,000 విలువైన అదనపు ఫీచర్లతో కూడిన స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, టాటా నానో డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి సరికొత్త వెర్షన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువస్తామని రతన్ టాటా ఇటీవలే వ్యాఖ్యానించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 2, 2013, 18:44 [IST]
English summary
Tata Nano has become India’s first auto brand to cross 3 million Facebook fans. With its unique engagement style and consistent efforts, Tata Nano has achieved this feat in an unbelievable span of just 12 months. From fun FB Apps like Nano Expert Quiz to Drive with MTV and Nano Student of the Year, Nano has done several activities in the digital space to appeal to its extremely diverse fans.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+