భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్ 'టాటా నానో'

టాటా నానో విషయంలో విజయాల కన్నా విమర్శలే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ బుజ్జి కారు భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా ఘనత సాధించింది. ట్రస్ట్ రీసెర్ట్ అడ్వైజరీ నిర్వహించిన 'ది బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్, ఇండియా స్టడీ 2013' అధ్యయనంలో టాటా నానో భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా నిలిచింది. 16 భారతదేశపు ప్రధాన నగరాల్లో సుమారు 19,000 బ్రాండ్‌లపై ఈ అడ్వైజరీ తమ అధ్యయాన్ని నిర్వహించింది. ఇన్ని వేల బ్రాండ్‌లలో టాటా నానో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలవటం విశేషం.
ప్రస్తుతం టాటా మోటార్స్ తమ ప్రజల కారును అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉంది. నానో డిజైన్, ఇంజన్ విషయంలో తలెత్తిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇప్పుడు అధిక సామర్థ్యం కలిగిన (800సీసీ) ఇంజన్‌ను కొత్త టాట నానో కారులో అమర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా, నానోలో మరిన్ని వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూడా కంపెనీ యోచిస్తోంది. టాటా మోటార్స్ ఇప్పటికే ఓ డీజిల్, సిఎన్‌జి వెర్షన్ టాటా నానో కార్లను భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications








