టాటా నానోపై ఎక్సేంజ్ బోనస్ ఆఫర్

By Ravi

Tata Nano
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న చిన్న కారు టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు గడచిన జూన్ నెలలో ప్రవేశపెట్టిన ఎక్సేంజ్ ఆఫర్ స్కీమ్‌ను కంపెనీ ఈ నెలలో కూడా అందుబాటులో ఉంచింది.

ఈ ఆఫర్‌లో భాగంగా, ఏదైనా పాత ద్విచక్ర వాహనాన్ని ఎక్సేంజ్‌ చేసుకుంటే టాటా నానోపై రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌ను, అలాగే ఏదైనా పాత ఫోర్ వీలర్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే కొత్త నానోపై రూ.30,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

అంతేకాకుండా, మహీంద్రా ఫైనాన్స్ ద్వారా కేవలం రూ.10.99 శాతం వడ్డీ రేటుకే ఆకర్షనీయమైన ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. టాటా నానో కోసం గతంలో కంపెనీ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

గడచిన కొద్దినెలలుగా టాటా నానో అమ్మకాలు భారీగా క్షీణించాయి. ఇప్పటికే గుజరాత్‌లోని నానో కారు ప్లాంటులో కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించింది. నానో అమ్మకాలను పెంచుకునేందుకు గాను కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను, అలాగే ఓ సిఎన్‌జి వేరియంట్‌ను ఆవిష్కరించింది. అయితే, ఈ మోడళ్లను ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురాలేదు.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2013, 13:10 [IST]
English summary
On exchanging any two wheeler Tata will offer a discount of Rs 15,000 on a new Nano, while exchanging a four wheeler will get you a discount of Rs 30,000. The latter is subjected to conditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+