జనవరి 15న పవర్ స్టీరింగ్‌తో 'టాటా నానో ట్విస్ట్' విడుదల

టాటా మోటార్స్ అందిస్తున్న చిన్న కారు టాటా నానోపై పడిన 'చవక కారు' అనే ముద్రను తొలగించేందుకు కంపెనీ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే, పవర్ స్టీరింగ్ జోడించిన టాటా నానోను అతిత్వరలోనే కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

తాజా అప్‌డేట్ ప్రకారం, జననరి 15, 2014వ తేదీన టాటా మోటార్స్ పవర్‌స్టీరింగ్‌తో కూడిన కొత్త 2014 టాటా నానో కారును విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి అందిన సమాచారం. అంతేకాదండోయ్.. పవర్ స్టీరింగ్‌తో కూడిన ఈ కొత్త నానో కారును 'టాటా నానో ట్విస్ట్' (Tata Nano Twist) అని పిలువనున్నారట.


అయితే, ఈ పవర్ స్టీరింగ్ ఫీచర్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్ (ఎల్ఎక్స్)లో మాత్రమే లభ్యం కావచ్చని సమాచారం. పవర్ స్టీరింగ్ ఫీచర్ జోడించిన కారణంగా, టాటా నానో ధర రూ.15,000 వరకు పెరగవచ్చని అంచనా. టాటా నానో ట్విస్ట్‌లో ఉపయోగించనున్న ఈ పవర్ స్టీరింగ్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ కంపెనీ జెడ్ఎఫ్ ఫ్రీడ్రిచ్‌సాఫెన్ నుంచి గ్రహించినట్లు సమాచారం. అయితే, ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగా లేక హైడ్రాలిక్ పవర్ స్టీరింగా అనేది మాత్రం తెలియరాలేదు.
New Tata Nano

అయితే, కొత్త టాటా నానో ట్విస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం నానోలో ఉపయోగిస్తున్న 624సీసీ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త నానో ట్విస్ట్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 11, 2013, 18:25 [IST]
English summary
According to an AutoCar report, Tata Nano with power steering will be launched as early as January 15, 2014 and this specific model will be called Nano Twist.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+