జనవరి 13న పవర్ స్టీరింగ్ 'టాటా నానో ట్విస్ట్' విడుదల

By Ravi

పవర్ స్టీరింగ్ వెర్షన్‌ టాటా నానో (నానో ట్విస్ట్) విడుదల తేదీ మారింది. ఈ మోడల్‌ను జనవరి 13, 2014న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే నెల 13న ముంబైలో జరగనున్న ఓ కార్యక్రమంలో టాటా నానో ట్విస్ట్‌ను విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం లభిస్తున్న రెగ్యులర్ టాటా నానో కారుతో పాటుగా ఈ కొత్త 2014 టాటా నానో ట్విస్ట్ (పవర్ స్టీరింగ్ వెర్షన్)ను కూడా ఆఫర్ చేయనున్నారు. పవర్ స్టీరింగ్ కలిగిన టాటా నానో ట్విస్ట్ రెగ్యులర్ టాటా నానో ధర కన్నా సుమారు రూ.15,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

Tata Nano Twist

నానో ట్విస్ట్‌లో ఉపయోగించనున్న పవర్ స్టీరింగ్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ కంపెనీ జెడ్ఎఫ్ ఫ్రీడ్రిచ్‌సాఫెన్ నుంచి సేకరిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. టాటా నానో ట్విస్ట్‌ను ఎక్స్ఈ, ఎక్స్‌టి అనే రెండు వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. ఈ రెండు వేరియంట్లు ప్రస్తుత సిఎక్స్, ఎల్ఎక్స్ మాదిరిగానే ఉంటాయి. వీటిల్లో కేవలం పవర్ స్టీరింగ్ ఫీచర్ మాత్రమే భిన్నంగా ఉంటుంది.

నానో ట్విస్ట్ కొత్త పర్పల్ బాడీ కలర్‌లో లభ్యం కానుంది. కాగా.. కొత్త టాటా నానో ట్విస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం నానోలో ఉపయోగిస్తున్న 624సీసీ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త నానో ట్విస్ట్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 28, 2013, 11:15 [IST]
English summary
Power steering equipped Tata Nano Twist will be launched on January 13, 2014. The launch event will take place in Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+